Skip to main content

Jio Glasses: జియో నుంచి మరో అద్భుత ఆవిష్కరణ.. మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ గ్లాసెస్‌.. - TV9 Telugu

|
Updated on: Nov 06, 2023 | 9:42 PM
రిలయన్స్‌ సంస్థ నుంచి స్మార్ట్ గ్లాసెస్‌ లాంచ్‌ చేయనున్నారు. 2023 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ను పరిచయం చేశారు. మెటాలిక్‌ ఫ్‌రేమ్‌తో రెండు లెన్స్‌లను ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను యూఎస్‌బీ కేబుల్‌ సహాయంతో స్మార్ట్ ఫోన్‌కి కనెక్ట్ చేసుకొని, డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే వైర్‌లెస్‌ కనెక్టివటీకి కూడా సపోర్ట్ చేస్తుంది.
బ్లూటూత్ సహాయంతో స్మార్ట్ ఫోన్‌ను, స్మార్ట్ గ్లాసెస్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించి జియో గ్లాసెస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ కేవలం 75 గ్రాముల బరువు ఉండడం విశేషం.
ఈ స్మార్ట్ గ్లాస్‌ 100 ఇంచెస్‌ వర్చువల్‌ డిస్‌ప్లేగా పనిచేస్తుంది. కళ్లముందే గాలితో తేలియాడే స్క్రీన్‌ను చూస్తున్న అనుభూతిని పొందొచ్చు. ఆడియో కోసం రెండు వైపులా స్పీకర్లు, మైక్రోఫోన్‌ను అందించారు. దీంతో వాయిస్‌ కాల్స్‌ను కూడా గ్లాసెస్‌తో మాట్లాడుకోవచ్చు.
ఇక బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్‌ చేయడానికి ట్రాక్‌ప్యాడ్ కంట్రోల్స్ ఇందులో అందించారు. గ్లాసెస్‌లో 4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే మూడు గంటలు పనిచేస్తుంది. ధర గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డిసెంబర్‌లో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

source

Comments

Popular posts from this blog

Apple wins over AliveCor antitrust lawsuit ov

Apple has finally got a win over the ongoing legal battle with AliveCor, the US-based medical device company over the Apple Watch's heart monitoring technology. AliveCor had accused the tech giant for limiting third-party access to specific heart rate data which is collected by the Apple Watch, claiming that it was an anti-competitive move. However, a judge in a US District Court has ruled completely in favour of Apple, stating that the company is not required to stand trial for the lawsuit In the 9to5Mac report, Apple's spokesperson w...